కోటి డౌన్లోడ్స్ ను చేరుకున్న కూ యాప్

కోటి డౌన్లోడ్స్ ను చేరుకున్న కూ యాప్

వివిధ భారతీయ బాషలలో అందుబాటులో ఉన్న మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ కూ (Koo) యాప్ 1 కోటి 1 crore డౌన్లోడ్ లను దాటేసింది. గత ఏడాది మార్చి ప్రారంభమైనప్పటి నుండి అతి వేగంగా యూజర్లు (Users) పెరుగుతున్నారు. ఈ దేశీయ యాప్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులతోపాటు సినీ తారలు,  క్రీడాకారులు, రచయితలు, పాత్రికేయులు వంటి ప్రముఖులు వారి అప్డేట్లను ఎనిమిది భాషల్లో పంచుకుంటూ వారి ఫాలోవర్స్ తో ప్రతిరోజూ కనెక్ట్ అవుతున్నారు.
అప్రమేయ రాధాకృష్ణ మరియు మయాంక్ బిదావత్క ల సరికొత్త ఆలోచనలతో అందుబాటులోకి వచ్చిన కూ (Koo) ఇప్పుడు మన తెలుగు భాషతోపాటు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, అస్సామీ మరియు  బంగ్లాతో సహా 8 భాషలలో అందుబాటులో ఉంది. భారతదేశంలో మొదటిసారి ప్రారంభమైన ప్లాట్‌ఫామ్‌ కూ (Koo) ను ఇప్పుడు అనేక సాంకేతిక ఫీచర్స్ అందుబాటులోకి తేవడంతో యూజర్స్ పెరుగుతున్నారు. యూజర్స్ సంఖ్యను పెంచుకునేందుకు రాబోయే రోజుల్లో భారతీయులకు మరిన్ని ఫీచర్లను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూ (Koo) ప్రకటించింది.