- ఎజెండా అంశాలు పంపాలని రెండు రాష్ట్రాలకూ లేఖ
హైదరాబాద్, వెలుగు: పోస్ట్ మాన్సూన్సమావేశానికి కృష్ణా రివర్మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) రెడీ అవుతున్నది. జనవరిలో 21వ బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నాటికి బోర్డు సభ్యులు తమ ఎజెండా అంశాలను పంపాలని చైర్మన్ కోరారు.
ఈ మేరకు మెంబర్‌సెక్రటరీ ఎస్కే కాంబోజ్.. రెండు రాష్ట్రాలకూ లేఖ రాశారు. జలసౌధ వేదికగా ఈ సమావేశం జరగనుంది. కాగా, ఈ ఏడాది జులై 5న బోర్డు 20వ సమావేశాన్ని నిర్వహించారు. అడ్డమైన కొర్రీలు పెట్టి.. ఆ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరఫున ఈఎన్సీ హాజరయ్యారు.
తాజాగా నిర్వహించే మీటింగుకైనా ఏపీ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు మీటింగ్ఎజెండాలో భాగంగా మన రాష్ట్రం పోలవరం నల్లమలసాగర్ లింక్ అంశాన్ని చేర్చే అవకాశాలున్నాయి. బనకచర్ల లింక్‌లో మార్పులు చేసి నల్లమలసాగర్ లింక్‌కు ఏపీ తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై గట్టిగానే నిలదీసే అవకాశముంది.
