కృష్ణా నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద

కృష్ణా నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత

ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం సుమారు 5 లక్షల క్యూసెక్కుల మేర కొనసాగుతోంది. వర్షాలు కొనసాగుతుండడంతో రేపటి వరకు కాస్త అటు ఇటుగా ఇదే వరద కొనసాగే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఈ సీజన్లో గరిష్ట స్థాయిలో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నీటి విడుదల జరుగుతోంది. అలాగే నాగార్జునసాగర్ లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం శ్రీశైలం వద్ద 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం వద్ద టోటల్ ఇన్ ఫ్లో 4 లక్షల 41 వేల క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్ల ద్వారా 4 లక్షల 72 వేల క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 26 వేల 500 క్యూసెక్కుల వరద దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు వద్ద…

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద 40 గేట్లు ఎత్తివేశారు. భారీ వరద కొనసాగుతుండడంతో మొత్తం 40 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.

ఇన్ ఫ్లో: 4 లక్షల 26 వేల క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 4 లక్షల 22 వేల 929 క్యూసెక్కులు

పూర్తి స్థాయి సామర్థ్యం: 9.657 టీఎంసీలు.. ప్రస్తుతం నీటి నిల్వ: 4.567 టీఎంసీలు

పూర్తి స్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లు.. ప్రస్తుతం నీటిమట్టం 315.570 మీటర్లు

ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం డ్యామ్ వద్ద..

ఇన్ ఫ్లో:  4 లక్షల 41 వేల క్యూసెక్కులు (సుంకేశుల మీదుగా 29 వేల క్యూసెక్కుల తుంగభద్ర వరద.. జూరాల మీదుగా 4 లక్షల 65 వేల క్యూసెక్కుల వరద)

శ్రీశైలం అవుట్ ఫ్లో: హంద్రీ-నీవాకు 2 వేలు, పోతిరెడ్డిపాడుకు 7 వేలు, డ్యామ్ కు దిగువన నాగార్జునసాగర్ కు 4 లక్షల 99 వేల క్యూసెక్కులు)

పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు (215.807 టీఎంసీలు)

ప్రస్తుత నీటిమట్టం: 884.20 అడుగులు (210.9946 టీఎంసీలు)

ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  కొనసాగుతున్న  వరద

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 18క్రస్టు గేట్లు 15 అడుగుల మేర ఎత్తివేశారు.

ఇన్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

అవుట్ ఫ్లో :4,28,267 క్యూసెక్కులు.

పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

ప్రస్తుత నీటి నిల్వ  : 310.5510 టీఎంసీలు.

పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు