హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ఎడమ కాల్వ నీటి నష్టంపై స్టడీ చేసేందుకు కృష్ణా బోర్డు ఐదుగురు అధికారులతో కమిటీ వేసింది. వీరు రెండు రోజులపాటు ఫీల్డ్విజిట్చేయనున్నారు. మార్చి 16, 17 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్వ స్టార్టింగ్పాయింట్ నుంచి 140 కిలోమీటర్ పాయింట్వరకు నీటి నష్టంపై స్టడీ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీసర్లకు లేఖ రాసింది.
కెనాల్‌కు స్థిరంగా నీటిని విడుదల చేయాలని, చివరి వరకు నీళ్లు వెళ్లేలా చూడాలని సూచించింది. ఫీల్డ్వెరిఫికేషన్ సమయంలో ఓపెన్‌చేసిన గేట్లను తెరిచే ఉంచాలని, అప్పటికే మూసేసిన గేట్లను తెరవొద్దని చెప్పింది. డిశ్చార్జి డేటా, ఆఫ్టేక్ పాయింట్ వివరాలు, గ్రౌండ్ వాటర్డేటా, ఉష్ణోగ్రతలు, ఆవిరి లెక్కలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. కాగా, కృష్ణా బోర్డు వేసిన కమిటీలో తెలంగాణ నుంచి సత్తుపల్లి ఈఈ ఎస్.శ్రీనివాస్ రెడ్డి, కోదాడ ఈఈ జె.సత్యనారాయణ, ఏపీ నుంచి నూజివీడు ఈఈ కె.రామదాసు, జగ్గయ్యపేట ఈఈ కిశోర్, కృష్ణా బోర్డు ఈఈ ఎస్.వెంకటేశ్సభ్యులుగా ఉన్నారు.
