V6 News

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా

కృష్ణా బోర్డు మీటింగ్ వాయిదా

హైదరాబాద్​, వెలుగు: కృష్ణా బోర్డు మీటింగ్​వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం 21వ బోర్డు మీటింగ్‌‌‌‌ను నిర్వహిస్తామని ఇటీవల రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది.

రెండు రాష్ట్రాలు ఎజెండాలు కూడా పంపించాయి. అయితే, గురువారం ఇతర కార్యక్రమాలున్నందున సమావేశానికి హాజరు కాలేమని, మరో తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వం బోర్డును కోరింది. ఈ నేపథ్యంలోనే మీటింగ్‌‌‌‌ను వాయిదా వేసిన బోర్డు.. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.