విజయవాడ: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు, వాగులు, చెరువులు వరద నీటితో నిండుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు చాలా కాలం తర్వాత కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు చేరుకుంది. అధికారులు 50 గేట్లు తెరిచి సముద్రం లోకి నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో 58,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 36,250 క్యూసెక్కులు ఉంది. పంట సాగుకు కోసం 11,000 క్యూసెక్కులు విడుదల చేసారు..
ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నందున మూడు రోజులలో వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదు అని హెచ్చరించారు.
