మోర్త్ ఆర్వోగా కృష్ణ ప్రసాద్..

మోర్త్ ఆర్వోగా కృష్ణ ప్రసాద్..
  • ప్రస్తుత ఆర్వో కుషువా ఢిల్లీకి బదిలీ

హైదరాబాద్, వెలుగు: మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ ( మోర్త్ ) తెలంగాణ రీజినల్ ఆఫీసర్, చీఫ్​జనరల్ మేనేజర్ (సీజీఎం) గా కృష్ణప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలి వరకు ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హెచ్ ఏ ఐ) టెక్నికల్ సీజీఎంగా పనిచేశారు. ఎన్ హెచ్ ఏ ఐ తెలంగాణ రీజినల్ ఆఫీసర్ గా కూడా సేవలు అందించారు. తిరిగి మళ్లీ రాష్ర్టానికి బదిలీ అయ్యారు. 

ఆర్వోగా నియమితులు కావడంతో సోమవారం( సెప్టెంబర్23, 2024) సెక్రటేరియెట్ లో ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందనను కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణ ప్రసాద్ నియామకంపై మంత్రి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆర్వోగా ఉన్న కుషువా ఢిల్లీకి బదిలీ అయ్యారు.