హైదరాబాద్, వెలుగు: పులిచింతల ప్రాజెక్టుకు దిగువ చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలను అందించాలని తెలంగాణ సర్కారుకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశాలిచ్చింది. పులిచింతల దిగువన ఊరవాగు, బుగ్గ వాగులపై రాజీవ్ గాంధీ లిఫ్ట్ స్కీమ్ చేపట్టేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైందని, దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని పేర్కొంది.
ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధమని ఆక్షేపిస్తున్నదని, ప్రాజెక్టును చేపట్టకుండా తెలంగాణ సర్కారును నిరోధించాలని ఫిర్యాదు చేసిందని లేఖలో బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని తెలంగాణకు సూచించింది.
