మినీ ట్యాంక్బండ్కు రూ. కోటి మంజూరు.. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం 

మినీ ట్యాంక్బండ్కు రూ. కోటి మంజూరు.. మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం 

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని ఊరు మందమర్రి చెరువు మినీ ట్యాంక్​బండ్​అభివృద్ధికి  మంత్రి వివేక్​ వెంకటస్వామి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆదివారం మందమర్రి పాతబస్టాండ్​ మినీ ట్యాంక్​ బండ్​ మార్నింగ్​ వాక్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ బండి సదానందంయాదవ్​ ఆధ్వర్యంలో మంత్రి వివేక్​, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. 

సదానందం యాదవ్​ మాట్లాడుతూ.. మంత్రి వివేక్​ మార్నింగ్​ వాక్​లో భాగంగా ఊరు మందమర్రి చెరువు మినీ ట్యాంక్​ బండ్​ను సందర్శించారన్నారు. ఇక్కడ నెలకొన్న సమస్యలు, మహిళల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకవెళ్లినట్లు చెప్పారు. స్పందించిన మంత్రి ట్యాంక్​ బండ్​ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు. 

చెన్నూరు నియోజకవర్గం,పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి, ఎంపీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇరువురు నేతలకు వాకర్స్, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.