
- అతడు తెలంగాణ ప్రజల గుండెల్లోనే ఉంటాడు: హరీశ్‌రావు
- హస్తినాపురంలో ఉద్యమకారుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి
- హాజరైన కేటీఆర్, ఉద్యమకారులు, కళాకారులు
ఎల్బీనగర్, వెలుగు : బీఆర్ఎస్ సభలు, సమావేశాల్లో సాయిచంద్ లేని లోటు కనిపిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. చిన్నవయస్సులోనే సాయి మనకు దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్‌లో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ -వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. ఈ సభకు హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభలో సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, -నివాళి అర్పించారు. అనంతరం సాయిచంద్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. సాయి మన మధ్యన లేకున్నా.. ఆయన పాట, ఆట చిరస్మరణీయని, అతడు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడని తెలిపారు.
తన ఆట, పాటలతో సాయిచంద్ తెలంగాణ ఉద్యమాన్ని కెరటంగా మలిచాడని కేటీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.