ఫోన్​ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ హస్తం 

ఫోన్​ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ హస్తం 
  •     సిరిసిల్లలో వార్‌‌‌‌‌‌‌‌రూమ్ ఏర్పాటు చేశారు
  •     సిటీ సీపీ శ్రీనివాస్​రెడ్డికి కాంగ్రెస్ ​నేత ఫిర్యాదు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌‌‌‌ హస్తం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత,  సిరిసిల్ల ఇన్​చార్జ్ కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారం సేకరించిన కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్లలో వార్‌‌‌‌‌‌‌‌రూమ్ ఏర్పాటు చేసి, తన ఫోన్‌‌‌‌తోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని మహేందర్​రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు సోమవారం మహబూబ్ నగర్ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డితో కలిసి హైదరాబాద్‌‌‌‌ సీపీ శ్రీనివాస్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం మహేందర్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నామమాత్రంగా ఉన్నారన్నారు. కేసీఆర్‌‌‌‌ కుటుంబం భావ స్వేచ్ఛ లేకుండా చేసిందని మండిపడ్డారు. సిరిసిల్లలో వార్‌‌‌‌‌‌‌‌రూమ్ నుంచి తన ఫోన్లను ట్యాప్‌‌‌‌ చేశారని ఆరోపించారు. తనను బీఆర్ఎస్​లోకి రావాలని గతంలో పిలిచారని, ఆ టైంలోనే ఫోన్ల ట్యాపింగ్ ​జరిగిందన్నారు.