డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన కేటీఆర్

డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్  బస్సులను మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతి కుమారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంఐ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజ్  ఏరియాల్లో ఇవి తిరగనున్నాయి.

మొత్తం 6 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్‌ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ బస్సులు ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిలో మీటర్ల వరకు వెళ్తుంది.