ఉద్యోగులను తొలగించకండి: యాజమాన్యాలకు కేటీఆర్ లేఖ

ఉద్యోగులను తొలగించకండి: యాజమాన్యాలకు కేటీఆర్ లేఖ

రాష్ట్రంలోని ఐటీ సంస్థలు, ఇతర పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించ వద్దంటూ యాజమాన్యాలకు లేఖ రాశారు మంత్రి కేటీఆర్.  కోరోనా విజృంభిస్తుండడంతో దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా పరిశ్రమలకు, పలు కంపెనీలకు ఆదాయం తగ్గింది. దీంతో ఆర్థికలోటు ఏర్పడింది. ఇందుకుగాను ఆర్థికలోటును పూడ్చుకోవడానికి పలు సంస్థలు ఉద్యోగులను తీసివేయడానికి రెడీ అయ్యాయి. దీంతో ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసివేయవద్దని కేటీఆర్ ఆయా సంస్థల యాజమాన్యాన్ని కోరారు.

మే3 వరకు లాక్ డౌన్ ఉండటంతో దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు, ప్రైవేటు కంపెనీల ఆదాయంలో కూడా తగ్గదల నమోదైంది. అయితే మే4 నుంచి లాక్ డౌన్ ను పలు చోట్ల ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డొమెస్టిక్ విమానాలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసుకోవడానికి కూడా అనుకూల వైఖరి రావచ్చని తెలుస్తుంది.