ట్విట్టర్ లో రాహుల్ కు కేటీఆర్ చురకలు

ట్విట్టర్ లో రాహుల్ కు కేటీఆర్ చురకలు

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకుల మధ్యన మాటల యుద్ధం నడుస్తుంది. బహిరంగ సభల్లో ఎకరిపై ఒకరు విరుచుకుపడగా..ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ TRS పై మాటల తూటాలు పేల్చారు. నరేంద్ర మోడీ రిమోట్‌ తో కేసీఆర్‌ ను కంట్రోల్ చేస్తున్నారంటూ విమర్శించారు.

రాహుల్ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్‌ లో స్పందించిన కేటీఆర్.. రిమోట్ కంట్రోలింగ్ ప్రధానులు, ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పేటెంట్ అని దేశంలోని అందరికి తెలుసని సెటైర్లు పేల్చారు. అంతేకాదు కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రాలపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నాయని.. కానీ తమ రిమోట్, భవిష్యత్ మాత్రం తెలంగాణ ప్రజలంటూ చురకలంటించారు.