
తెలంగాణ భవన్: హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని ఇన్ చార్జ్ లకు సూచించారు మంత్రి కేటీఆర్. బుధవారం తెలంగాణ భవన్ లో ఉప ఎన్నిక పై నల్గొండ జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని ప్రతీ మండలానికి ఎన్నికల ఇంచార్జి లను నియమించారు. ఎమ్మెల్సీ లు,జనరల్ సెక్రటరీలు,జడ్పి చెర్మెన్ లను ఇంచార్జి లుగా నియమించి గెలుపే లక్ష్యం గా పనిచేయాలని సూచించారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అందరూ కలిసి పని చెయ్యాలని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు అయ్యేంతవరకు ఇంచార్జ్ లు ఎవ్వరూ హుజుర్ నగర్ దాటి రావద్దని ఆయన ఆదేశించారు.