- కేటీఆర్‌కు విప్ ఆది శ్రీనివాస్ సూచన
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేసి ముందు బీఆర్ఎస్లో తన రాజకీయ ఫ్యూచర్ ఏంటో చూసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్‌ను జనం నిర్ణయించారని, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తప్పుడు ప్రచారం చేసినా బీఆర్ఎస్ను ప్రజలు నమ్మేది లేదన్నారు.
కేటీఆర్ తీరుచూస్తే కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తానని అన్నట్లు ఉందన్నారు. బీఆర్ఎస్ అసలు ఉంటుందా.. ఉండదా.. అని రాష్ట్రంలో చర్చ జరుగుతున్న సమయంలో కేటీఆర్ అధికారంపై పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే బీఆర్‌ఎస్ నేతలకు వచ్చిన కడుపునొప్పి ఏంటని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
