బీజేపీ.. పూజకు పనికిరాని పువ్వు.. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలే: కేటీఆర్

బీజేపీ..  పూజకు పనికిరాని పువ్వు.. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలే: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ.. పూజకు పనికిరాని పువ్వు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీతో రాష్ట్రానికి రూపాయి పని జరగలేదని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీకి చెందిన చెర్క మహేశ్.. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడారు. జూబ్లీహిల్స్​ప్రజలు కారు కావాలో.. బుల్డోజర్​కావాలో నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు.

 ‘‘జూబ్లీహిల్స్​ఉప ఎన్నికతో కాంగ్రెస్​ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్​గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న ఆ పార్టీ​నేతలు.. ప్రస్తుతం రెండేండ్లుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలి. ఎన్నికల్లో బుద్ధి చెప్తేనే ఆ పార్టీకి సోయి వస్తుంది. రెండేండ్ల పాలనలో సంపాదించిన అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్​లో ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇస్తారు” అని ఆరోపించారు. 

‘‘తెలంగాణకు పనికిరాని పార్టీ బీజేపీ. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే మోరీల్లో వేసినట్టే. హైదరాబాద్​మళ్లీ అభివృద్ధిలోకి రావాలంటే కేసీఆర్​మళ్లీ సీఎం కావాల్సిందే. అది జూబ్లీహిల్స్​నుంచే మొదలుకావాలి. సీఎం రేవంత్​రెడ్డి రెండేండ్లుగా కేసీఆర్​పేరును జపించి కాలం గడిపారు” అని అన్నారు.  

ఒక్క మంచి పనీ చేయలే.. 

అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా కాంగ్రెస్​ ప్రభుత్వం ఒక్క మంచి పనీ చేయలేదని కేటీఆర్​విమర్శించారు. కాంగ్రెస్​మోసాన్ని గుర్తించిన ప్రజలు కోపంగా ఉన్నారన్నారు. సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గరీబోళ్ల ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపి ఇండ్లు కూల్చేయిస్తున్నారని ఆరోపించారు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతున్నారని మండిపడ్డారు. 

‘‘అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్​మోసం చేశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలుసు. ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేసిండు. అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు. కానీ ఆయనను కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రజలను మోసం చేయడమే రేవంత్​రెడ్డి నైజం” అని కేటీఆర్​ అన్నారు.