
కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ కస్తూర్బా స్కూల్ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఎస్.ఓ. కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు ఆందోళనకారులు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి ఐశ్వర్య కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మద్దతుగా స్థానికులు, వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు కుటుంబ సభ్యులతో జిల్లా విద్యాశాఖ అధికారి చర్చలు జరిపారు. అయితే జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామంటున్నారు కుటుంబీకులు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ ఉదయం కస్తూర్భా పాఠశాలలో విద్యార్థిని చనిపోయింది. రాత్రి స్కూల్ భోజనం తిన్న ఐశ్వర్యకు ఉదయం నోటి నుంచి నురగ రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకెళ్లారు. అక్కడి చికిత్స తీసుకుంటూ చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు.