నాడూ.. నేడూ అదే ఘోరం!

నాడూ.. నేడూ అదే ఘోరం!
  • పన్నెండేళ్ల కింద పాలెం వద్ద బెంగళూరు హైవేపై బస్సు ప్రమాదం 
  • ఓవర్ స్పీడుతో కల్వర్టును ఢీకొట్టిన వోల్వో బస్సు
  • మంటలు అంటుకొని 45 మంది దుర్మరణం
  • కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనతో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న పాలమూరు ప్రజలు

మహబూబ్​నగర్, వెలుగు: ఏపీలోని కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటన.. పన్నెండేళ్ల కిందట మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ఘటనను గుర్తుచేసింది. తాజా ఘటనలో 19 మంది మృతి చెందగా, అప్పటి ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3న దీపావళి పండుగ సందర్భంగా బెంగళూరులో ఉంటున్న తెలంగాణ, ఏపీకి చెందిన వాళ్లు సొంతూళ్లకు వెళ్లేందుకు జబ్బార్ ట్రావెల్స్ బస్సులో టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్ చేసుకున్నారు. 

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 29న రాత్రి 10 గంటలకు డ్రైవర్, క్లీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలుపుకొని మొత్తం 44 మందితో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బయలు దేరింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కర్నూల్, ఎర్రవల్లి చౌరస్తాలో మరో ఐదుగురు ప్యాసింజర్లు బస్సు ఎక్కారు. 

30న తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ -44పై కొత్తకోట మండలం పాలెం గ్రామం దాటగానే బస్సు ఓవర్ స్పీడుతో ఓ కారును ఓవర్ టేక్ చేస్తూ కల్వర్టును ఢీ కొడుతూ వెళ్లింది. ప్రమాద ధాటికి కల్వర్టు రెయిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఇనుప రాడ్డు బస్సుకు తగలడంతో ఫ్యూయల్ ట్యాంక్ నుంచి డీజిల్ లీక్​అయి.. మంటలు అంటున్నాయి. కొద్దిసేపటికే ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. వెంటనే డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు డ్రైవర్ క్యాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న క్లినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరో ఇద్దరు ప్యాసింజర్లు పక్కనున్న తలుపును తెరుచుకొని బయటకు దూకేశారు. అయితే, డ్రైవర్ క్యాబిన్ దగ్గర ప్యాసింజర్లు లోపలికి వెళ్లే డోరును తెరవలేదు.

 దీంతో ప్రయాణికులందరూ బస్సులోనే చిక్కుకుపోయారు. కొందరు డ్రైవర్ క్యాబిన్ వద్ద ఉన్న డోరును తెరిచేందుకు, మరికొందరు బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టడానికి ప్రయత్నించి మంటలు అంటుకొని ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వారు కూర్చున్న సీట్ల దగ్గరే కాలి బూడిదయ్యారు. స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 44 మంది చనిపోగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ ఆధారంగా డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీలను గుర్తించి బంధువులకు అప్పగించారు. 

డోర్ ఆటోమెటిక్ లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే పెరిగిన ప్రమాద తీవ్రత..

పాలెం వద్ద జరిగిన దుర్ఘటనలో, తాజాగా కర్నూల్ వద్ద జరిగిన ఘటనలో వోల్వో బస్సుల తలుపులు తెరుచుకోకపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వోల్వో బస్సుల క్యాబిన్ డోర్లు ఆటోమెటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లాక్ అవుతుండటంతో ప్రయాణికులు బయటకు రాలేకపొతున్నారు. దీంతో మంటల్లో చిక్కుకొని కాలి బూడిదవుతున్నారు. వోల్వో బస్సుల్లో ప్రమాదం జరిగిన వెంటనే ఆటోమెటిక్ లాక్​ ఓపెన్​ సిస్టం లేదా సైరన్ అలర్ట్ సిస్టం ఉంటే మృతుల సంఖ్య తగ్గి ఉండేదని నిపుణులు చెబుతున్నారు.