సిమ్ కార్డులు అమ్ముకున్న మేయర్​కు కోట్ల ఆస్తి ఎలా వచ్చింది : కుర్ర శివకుమార్ గౌడ్

సిమ్ కార్డులు అమ్ముకున్న మేయర్​కు కోట్ల ఆస్తి ఎలా వచ్చింది : కుర్ర శివకుమార్ గౌడ్
  • పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్​, కార్పోరేటర్లు ప్రశ్న

మేడిపల్లి, వెలుగు: గతంలో సిమ్​కార్డులు అమ్ముకున్న పీర్జాదిగూడ మేయర్​జక్కా వెంకటరెడ్డికి కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కాంగ్రెస్​కార్పొరేటర్లు ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత పేరు చెప్పి చెర్రీస్ ఫౌండేషన్​కు రూ.6 కోట్ల విలువ చేసే 650 గజాల పార్కును అమ్ముకుంది నిజం కాదా అని నిలదీశారు. కార్పొరేషన్ పరిధిలోని సీలింగ్ భూములను తెరమీదకు తెచ్చిందే వెంకట్​రెడ్డి చెప్పారు. సోమవారం వారు పీర్జాదిగూడలో ప్రెస్​మీట్​పెట్టి మాట్లాడారు. మేయర్ వెంకటరెడ్డి పర్వతాపూర్ లోని సీలింగ్ ల్యాండ్స్ లో ఫెన్సింగ్​వేసి, తనకు దగ్గరి వ్యక్తులకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఎక్కడ తన అవినీతి బయటపడుతుందో అనే భయంతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డికి మేయర్ పదవి దక్కేది కాదని, రాజకీయ భిక్ష పెట్టిన సుధీర్ రెడ్డిని ఏకవచనంతో విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదని దుయ్యబట్టారు. మేయర్ విధానాలు నచ్చకనే పార్టీ మారామని చెప్పారు. అభివృద్ధి అంటూ మేయర్​అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాశ్​నాయక్, నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాశం బుచ్చియాదవ్, పప్పుల‌ అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, బొడిగే కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, దర్గా సుధాకర్ రెడ్డి, చింతల నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.