కురుమూర్తిస్వామి..హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు

కురుమూర్తిస్వామి..హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తిస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.24.83 లక్షలు వచ్చినట్లు టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మధనేశ్వర్ రెడ్డి తెలిపారు. కురుమూర్తి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో విడత స్వామివారి హుండీని లెక్కించారు. కార్యక్రమంలో టెంపుల్ పరిశీలకులు శ్రీనివాస్, మెంబర్స్, శ్రీవారి సేవా సమితి మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.