కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో సోమవారం మొదలైన అనధికారిక రెండో యూత్ టెస్ట్‌లో ఇండియాకు మెరుగైన ఆరంభం లభించింది. కుశాగ్ర ఓజా (103 బ్యాటింగ్) సెంచరీకి తోడు యశవర్ధన్ చౌహాన్ (78) రాణించడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇండియా 65 ఓవర్లలో 253/3 స్కోరు చేసింది.
ఓజాతో పాటు మనల్ చౌహాన్ (55 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆరు ఓవర్లలోపే ఓపెనర్లు లక్ష్య రాయ్‌చందానీ (0), సాగర్ విర్క్ (0) డకౌటయ్యారు. తర్వాత యశవర్దన్ రెండో వికెట్‌కు 122 రన్స్ జోడించిన కుశాగ్ర.. మనల్‌తో మూడో వికెట్‌కు 131 రన్స్ జత చేశాడు. గిమ్హాన్ మెండిస్ 2 వికెట్లు తీశాడు.
