ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 ఫలితాలు విడుదల

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2 ఫలితాలు విడుదల

1,260 మందితో కూడిన లిస్ట్‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • టీజీ ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అభ్యర్థుల జాబితాతోపాటు  ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఇప్పటికే 9,203 పోస్టులు భర్తీ చేసినం: మంత్రి దామోదర
  • మరో 7,267 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్​ టెక్నీషియన్​ గ్రేడ్​ –2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. 

ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు, ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (టీజీ ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) తన అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జడ్ చోంగ్తూ, మెడికల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా ఈ పోస్టులకు 24,045 మంది దరఖాస్తు చేసుకోగా.. నిరుడు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10న జరిగిన సీబీటీ పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసిన అనంతరం తాజాగా బోర్డు 1,260 మందితో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్కులు, కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్ వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన కేసు హైకోర్టులో కొనసాగుతుండటంతో 2  పోస్టులను ఖాళీగా ఉంచింది. అలాగే, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో ఉన్న 18 పోస్టులకు సెలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాబితాను వేరేగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

వివిధ కోర్టు కేసుల కారణంగా మరో 4 పోస్టులను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచారు. రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా/ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్పత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  

పేషెంట్లకు మెరుగైన సేవలు: మంత్రి దామోదర

డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రభుత్వ హాస్పిటళ్లు కళకళలాడుతున్నాయని, పేషెంట్లకు మెరుగైన సేవలు అందుతున్నాయని  మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య శాఖలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి ముఖ్యమైన పోస్టులతోపాటు వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.  

ఇప్పటికే 9వేలకు పైగా పోస్టుల భర్తీ 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ వైద్యారోగ్య శాఖలో రికార్డు స్థాయిలో 9,203 పోస్టులను భర్తీ చేసింది. నిరుద్యోగులకు భరోసా కల్పిస్తూ చేపట్టిన ఈ నియామకాల్లో సింహభాగం నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 6,956 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ (2024, 2025) 1,569, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 422, జూనియర్ అసిస్టెంట్ 334, ఆయుష్ మెడికల్ ఆఫీసర్  138 , ఇతర పోస్టులు (ఫుడ్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ, ఫిజియోథెరపిస్ట్, డ్రగ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్) 90 పోస్టులను భర్తీ చేసింది. మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.  

మెడికల్ టూరిజంపై మంత్రి దామోదర సమీక్ష


సెక్రటేరియెట్​లోని తన చాంబర్​లో మంత్రి దామోదర రాజనర్సింహా మెడికల్ టూరిజంపై  సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జెడ్ చోంగ్తు, టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ కార్పొరేషన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.నరేంద్ర కుమార్, డైరెక్టర్ మెడికల్ హెల్త్ డా.రవీంద్ర నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.