ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం..యూనియన్లకు నోటీసులు

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం..యూనియన్లకు నోటీసులు
  • యూనియన్లకు కార్మిక శాఖ నోటీసులు

హైదరాబాద్​, వెలుగు: ఆర్టీసీ యూనియన్లతో రాజీ చర్చలు జరుగుతున్నాయని, ఆ టైంలోనే సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధమని కార్మిక శాఖ ప్రకటించింది. ఐదో తేదీ నుంచి సమ్మె చేస్తున్నామని జేఏసీలు ప్రకటించిన నేపథ్యంలో, ఆర్టీసీ యూనియన్లకు కార్మిక శాఖ జాయింట్​ కమిషనర్​ గంగాధర్​ మంగళవారం నోటీసులు పంపించారు. పరిశ్రమల వివాద చట్టం సెక్షన్‌‌ 22(1)(డీ) ప్రకారం రాజీ చర్చలు ముగిసిన వారం రోజులకు గానీ సమ్మె తేదీని ప్రకటించొద్దని అందులో పేర్కొన్నారు. చర్చలు పెండింగ్​లో ఉండగానే సమ్మె తేదీలు ప్రకటించారని తెలిపారు. ఆర్టీసీలో సమ్మె నిషేధం అమలవుతోందన్నారు. మొదట సెప్టెంబర్​ 23న మీటింగ్​ ఉంటుందని ప్రకటించినా, అది రద్దు అయింది. దీంతో ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు రాజీ ఒప్పందం ఉంటుందని కార్మిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.