
సెకెండ్ ఇన్సింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది కాజల్ అగర్వాల్. ఓవైపు స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అఖిల్ దేగల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘మేజర్’ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా నవంబర్ 11న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ ‘ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్‌లో కాజల్ పాల్గొన్న కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. దీపావళికి టీజర్ రిలీజ్ చేసి.. వచ్చే సమ్మర్‌కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందులో కాజల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు’ అని అన్నారు.