పంజాగుట్ట, వెలుగు: లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ విగ్రహాన్ని నల్లమల్ల అడవి ప్రాంతంలో కాకుండా హైదరాబాద్లో ఏర్పాటు చేసి గౌరవించాలని సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ కోరారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. లంబాడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపి సేవాలాల్ విగ్రహం యాదగిరి గుట్టలో గానీ హైదరాబాద్‌లో గానీ ఏర్పాటు చేయించాలని కోరారు. లేని పక్షంలో లంబాడా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
