భూకబ్జా కేసు:  నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్..  కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

భూకబ్జా కేసు:  నకిలీ పేపర్లు.. ఖాళీ ప్లాట్లు రిజిస్ట్రేషన్..  కరీంనగర్ పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
  • నిందితుల్లో  సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామి

కరీంనగర్ క్రైమ్‌‌‌‌, వెలుగు: నకిలీ పేపర్లతో ఖాళీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులో సీపీఐ మాజీ నాయకుడు మర్రి వెంకట స్వామితోపాటు కిన్నెర మల్లవ్వ, ఖలీదా బేగం, మహ్మద్ బబ్లూను కరీంనగర్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.

హైదరాబాద్‌‌‌‌లో నివాసముండే షేక్ హసన్ తల్లిదండ్రులు షేక్ అలీమా, షేక్ అహ్మద్ పేరిట కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట రెవెన్యూ శివారు సర్వే నంబర్ 212, 214 లో 16.20 ఎకరాల భూమిలో 1988లో లేఅవుట్  చేశారు. వీటిలో కొన్ని ప్లాట్లను మర్రి వెంకటస్వామి సహా 20 మంది ఒకరి తర్వాత ఒకరు సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు చేసుకొని, మళ్లీ వారే సప్లిమెంట్ డీడ్ ల పేరిట  సవరణ చేశారు.

న్యాయవాది మర్రి వెంకట స్వామి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ తప్పుడు దస్తావేజులు సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మర్రి వెంకట స్వామి, కిన్నెర మల్లవ్వ, మొహమ్మద్ ఖలీదా బేగం, మొహమ్మద్ బబ్లూను  శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.