కరీంనగర్ PMJ జ్యూవెలరీలో చోరీ.. షోరూంలోకిి చొరబడి.. గన్తో కాల్పులు

కరీంనగర్ PMJ జ్యూవెలరీలో చోరీ.. షోరూంలోకిి చొరబడి.. గన్తో కాల్పులు

కరీంనగర్: కరీంనగర్లోని PMJ జ్యువెలరీ షోరూంలో దొంగలు పడ్డారు. భారీగా చోరీ చేశారు. నలుగురు దొంగలు తుపాకులతో షాపులోకి చొరబడ్డారు. దీంతో.. షాపులో ఉన్న కస్టమర్లు, స్టాఫ్ బెంబేలెత్తిపోయారు. దొంగలను అడ్డుకునేందుకు యత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపారు.

భారీగా బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడ నుంచి రెండు బైకులపై ఉడాయించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీసులకు ఈ సమాచారం అందగానే స్పాట్కు చేరుకున్నారు. నాలుగు టీమ్స్గా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో రెండు బుల్లెట్లు దొరికాయి.