గుట్టపై నుంచి దొర్లుకుంటూ వచ్చిన పెద్ద బండరాయి

గుట్టపై నుంచి దొర్లుకుంటూ వచ్చిన పెద్ద బండరాయి

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ గంధంగూడా జన్నారం JNNURM కాలనీలో పెద్ద ప్రమాదం తప్పింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కరిగిపోయి గుట్టపై నుంచి పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చింది. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వేప చెట్టును మోరీని తట్టుకొని బండరాయి ఆగిపోయింది. లేకుంటే కాలనీలోని ఇళ్లు ధ్వంసమయ్యేవి. మరో రెండు, మూడు రాళ్లు సైతం దొర్లే ప్రమాదం ఉందన్నారు స్థానికులు. వర్షాలు పడితే తమకు భయమేస్తోందని చెప్పారు. రోడ్లు సరిగాలేవని,, తాగునీరు రావడం లేదని, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు స్థానికులు.