
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సోమవారం రాష్ట్రానికి రానున్నారు. పది రోజులకు పైగా ఆమె ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. తమిళనాడు బీజేపీ వలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే, గవర్నర్‌గా రిజైన్ చేశాక తొలిసారి రాష్ట్రానికి ఆమె బీజేపీ నేతగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఆమె ఎలాంటి ఆరోపణలు చేస్తారో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆదివారం సాయంత్రమే చెన్నై – ఎడుంబూరు రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్‌కు చార్మినార్ ఎక్స్ ప్రెస్‌లో ఆమె బయల్దేరారు.
ఇయ్యాల నడ్డా కూడా
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా సోమవారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్‌లో జరిగే సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని నిజాంపేటలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.