ప్రొఫెసర్ ప్రస్టేషన్ : ఉద్యోగం ఇవ్వటం లేదని కాల్చి చంపేశాడు

ప్రొఫెసర్ ప్రస్టేషన్ : ఉద్యోగం ఇవ్వటం లేదని కాల్చి చంపేశాడు

లాస్ వెగాస్ క్యాంపస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, కాల్పులు జరిపిన వ్యక్తి కూడా అక్కడే శవమై కనిపించాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, ఒకరు మాత్రం గాయాలతో కనిపించాడు.

ప్రాథమిక నివేదికల ప్రకారం విశ్వవిద్యాలయంలో ముగ్గురిని చంపిన ఆ 67ఏళ్ల దుండగుడు మరొవరో కాదు.. అతను ఓ ప్రొఫెసర్. యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఈ కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అయితే అతను పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటన అనంతరం పోలీసులు యూనివర్సిటీని ఖాళీ చేయించారు. మృతుల వివరాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  

కాల్పుల నేపథ్యంలో నెవాడా విశ్వవిద్యాలయం సహా అన్ని ఇతర దక్షిణ నెవాడా విద్యాసంస్థలను బుధవారం మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం సమీపంలోని రహదారులను మూసివేశారు. లాస్ వెగాస్ స్ట్రిప్‌కు తూర్పున రెండు మైళ్ల కంటే తక్కువ దూరంలో నెవాడా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ దాదాపు 25,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టరల్ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.