హైదరాబాద్ లో వీకెండ్ బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జి సిటీ దగ్గర అర్థరాత్రి కొందరు యువత బైక్ రేసింగ్ చేస్తూ, ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. ఆకతాయిలు రోడ్లపై బైకులతో విన్యాసాలు చేస్తూ విరంగం సృష్టించారు. అక్టోబర్ 20న అర్థరాత్రి పదిమంది బైక్ రైడర్లను రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు.
Also Read :- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
వారి వద్ద నుంచి పది రేసింగ్ బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోకిరీలు ఇలా బైక్ రేసింగులకు పాల్పడ్డారు. వారిపై రాయదుర్గం పోలీసులు కేసులు నమోదు చేశారు. యువకులు కేసులు నమోదు చేసినా పట్టించుకోవడం లేదు.