Kiara Advani-Janhvi Kapoor:సూపర్‌ అప్డేట్‌..శింబుకి జోడిగా ఎన్టీఆర్,చరణ్ల హీరోయిన్స్..కమల్ హాసన్ భారీ లెవల్ ప్లాన్!

Kiara Advani-Janhvi Kapoor:సూపర్‌ అప్డేట్‌..శింబుకి జోడిగా ఎన్టీఆర్,చరణ్ల హీరోయిన్స్..కమల్ హాసన్ భారీ లెవల్ ప్లాన్!

తమిళ స్టార్ హీరో శింబు తన నెక్స్ట్ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బ్లడ్ అండ్ బ్యాటిల్’  ట్యాగ్‌‌లైన్‌‌తో ఓ వీడియో కూడా ఇటీవలే అనౌన్స్ చేశారు.ఈ మూవీని కమల్ హాసన్ ‘రాజ్‌‌ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై నిర్మిస్తుండటం విశేషం.ఇది శింబుకి 48వ సినిమా.

శింబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో..ఆయనకి జోడీగా ఇద్దరు బాలీవుడ్ బ్యూటీస్ కనిపిస్తున్నారు.అయితే ఈ బ్యూటీస్ ఇద్దరు తెలుగులో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్ళే. అందులో ఒకరు దేవర బ్యూటీ జాన్వీ కపూర్ కాగా..మరొకరు రామ్ చరణ్ బ్యూటీ కియారా అద్వానీ. ఇంతటి అరుదైన కాంబోని సెట్ చేసిన కమల్ హాసన్..శింబు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం కన్ఫమ్.

దీంతో బాలీవుడ్ లో తమదైన అందంతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఇద్దరు హీరోయిన్స్..కోలీవుడ్ సినిమాలో నటిస్తుండటంతో పాన్‌ ఇండియా మూవీ అవుతుందనేది మేకర్స్ ప్లాన్.త్వరలో ఈ క్రేజీ అప్డేట్ ను బిగ్‌ సర్‌ప్రైజింగ్‌ గా అనౌన్స్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 

ప్రస్తుతం శింబు తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ థగ్ లైఫ్ లో నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుండగా..కియారా అద్వానీ రామ్ చరణ్ తో రెండోసారి గేమ్ ఛేంజర్ మూవీలోకనిపిస్తుంది.