హైదరాబాద్, వెలుగు: నవీన్ అగర్వాల్ నేతృత్వంలోని ఎన్ఏఎన్ గ్రీన్ మెట్, బెల్జియంకు చెందిన సిలాక్స్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాయి. 50:50 భాగస్వామ్యంతో ఎన్ఏఎన్ సిలాక్స్ గ్రీన్ మెట్ పేరుతో ఈ జాయింట్ వెంచర్ ప్రారంభమైంది.
ఈ ప్లాంట్ ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజ్ రంగాల నుంచి సేకరించిన పాత బ్యాటరీలను ప్రాసెస్ చేస్తుంది. దీని ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి కీలక ఖనిజాలను తిరిగి సేకరిస్తుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 40వేల టన్నుల బ్యాటరీలను ముక్కలు చేయడం, 20వేల టన్నుల హైడ్రో మెటలర్జికల్ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
