హైదరాబాద్, వెలుగు: ఏఐ ప్లస్ తన కొత్త నోవా 2 ప్రో , నోవా 2 నియో ఫోన్ల అమ్మకాలను ఈనెల 26న ప్రారంభించింది. వీటిని ఫ్లిప్ కార్ట్ , కొన్ని ప్రత్యేక రిటైల్ స్టోర్లలో కొనవచ్చు. అన్ని బ్యాంకు కార్డులపై రూ. వెయ్యి డిస్కౌంట్పొందవచ్చు.
నోవా 2 నియో ధరలు రూ. 13 వేల నుంచి, నోవా 2 ప్రో 5జీ ధరలు రూ. 15 వేల నుంచి నుంచి మొదలవుతాయి. ఎక్కువ స్పీడ్ కోసం వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌లు అమర్చారు. రెండు మోడళ్లలోనూ 6000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉంటాయి.
