హైదరాబాద్, వెలుగు: ‘సర్’ ఎన్యూమరేషన్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం కమిటీ ప్రతినిధులు సీఈవోను కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. 2025 ఓటరు జాబితాలోని ప్రతి ఓటరుకు బీఎల్‌ఓలు ఇంటిం టికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉండ టంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని తెలి పారు.
ఆశా వర్కర్లు మూడ్రోజుల పాటు పల్స్ పోలియో విధుల్లో నిమగ్నమవ్వడం వల్ల కూడా ఫారాల పంపిణీ ఆలస్యమైందని సీఈవోకు వివరించారు. పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఓ) బూత్ లెవల్ అధికారులు ఇప్పటి వరకు ఓటర్ల జాబి తాలను అందించలేదని చెప్పారు.
పీసీసీ ప్రతినిధుల విజ్ఞప్తిపై సీఈవో సుదర్శన్ రెడ్డి సాను కూలంగా స్పందించారు. గడువు పెంపు అం శాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే, బూత్ స్థాయిలో జరుగుతున్న జాప్యంపై జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలకు దిశానిర్దేశం చేస్తామని సీఈవో హామీ ఇచ్చినట్టు పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేశ్ వెల్లడించారు.
