కోటక్ బ్యాంక్ కు సీఈఓ వాస్వానీ గుడ్ బై... పదవిలో కొనసాగేందుకు నిరాకరణ

కోటక్ బ్యాంక్ కు సీఈఓ వాస్వానీ గుడ్ బై... పదవిలో కొనసాగేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ: బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అశోక్ వాస్వానీ  మరో టర్మ్  కొనసాగరని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 తో ఆయన మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. వ్యక్తిగత కారణాలతో  తిరిగి నియామకానికి  ఆసక్తి చూపడం లేదని శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. 

గతంలో బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేస్, సిటీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పనిచేసిన  వాస్వానీ.. జనవరి 1, 2024న కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. బ్యాంక్ ఫౌండర్  ఉదయ్ కోటక్ సెప్టెంబర్ 2023లో అకస్మాత్తుగా తప్పుకున్నాక, తదుపరి శాశ్వత సీఈఓగా ఆయన నియమితులయ్యారు. 

వాస్వానీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా కొత్త ఎండీ, సీఈఓను నియమించే ప్రక్రియను ప్రారంభించినట్లు బ్యాంక్ బోర్డు తెలిపింది.