‘టౌన్ ప్లానింగ్’ మారేదెప్పుడు ? ఫిర్యాదుకు సమాధానాలివ్వరు.. సర్కిల్, జోనల్లో ఇష్టమున్నట్టు అనుమతులు, ఓసీలు

‘టౌన్ ప్లానింగ్’ మారేదెప్పుడు ? ఫిర్యాదుకు సమాధానాలివ్వరు.. సర్కిల్, జోనల్లో ఇష్టమున్నట్టు అనుమతులు, ఓసీలు
  • అక్రమ నిర్మాణాలపై కంప్లయింట్స్​ పట్టించుకోరు
  • అసహనంతో బాధితుల ఆత్మహత్యాయత్నాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్లలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రజల్లో రోజు రోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. అక్రమ నిర్మాణాలు, వివాదస్పద భూములు, డబుల్ రిజిస్ర్టేషన్లు అయిన వాటికి సైతం అనుమతులు ఈజీగా ఇస్తున్నారు. అనుమతుల జారీలో అవకతవకలు, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తదితర అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు కార్పొరేషన్లలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సగానికి పైగా ఫిర్యాదులు టౌన్​ప్లానింగ్​కు సంబంధించినవే ఉంటున్నాయి. వీటికి నెలలు గడుస్తున్నా సమాధానాలు ఇవ్వడంలేదు. ఇక చర్యల సంగతి దేవుడెరుగు. దీంతో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదునే మళ్లీ మళ్లీ ఇచ్చి పోతున్నారు. తమ ఫిర్యాదులకు స్పందన లేకపోవడంతో కలత చెంది కొందరు ఆత్మహత్యాయత్నాలకు వెనకాడడం లేదు.

హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఓ బాధితుడు తన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడని ఫిర్యాదు చేయగా, అధికారి ఫీల్డ్ కి వెళ్లాడు. అయితే, సదరు ఆఫీసర్​ఆక్రమణదారుడికి మద్దతు తెలిపేలా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధితుడు పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇదే తరహాలో గతంలో రాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదంటూ జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులోనే ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.

ఫీల్డ్కి వెళ్లకుండానే పర్మిషన్లు
నిర్మాణ అనుమతులతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) జారీ చేసే విషయంలో ఆఫీసర్లు రూల్స్​పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించకుండానే ఫైళ్లకు గ్రీన్​సిగ్నల్​ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు దారులు  ఆరోపిస్తున్నారు. 

నిర్మాణం పూర్తయ్యాక వాస్తు, ఇతర వాటి కోసం ప్లానింగ్ లో10 శాతం వెరియేషన్ వరకు ఓసీలు రిలీజ్ చేసే వెసులుబాటు ఉంది. కానీ, 20 శాతం వెరియేషన్ కన్నా ఎక్కువ ఉన్నా కొన్ని సర్కిల్స్ లో ఓసీలు ఇష్యూ చేస్తున్నారు. కొందరు అధికారులైతే ఆన్ లైన్ లో వచ్చిన అప్లికేషన్లను ఏదో ఒక కారణంతో షార్ట్ ఫాల్ చేస్తున్నారు. తిరిగి దరఖాస్తుదారులు అధికారులను కలిసి సెటిల్ మెంట్ చేసుకున్నాకే అప్రూవల్ ఇస్తున్నారు.

మూడు కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి..
మూడు కార్పొరేషన్లలోనూ టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదుల పరిష్కారంలో లేట్​చేయడం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, బాధ్యులపై చర్యల లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇదే అంశంపై ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేకపోవడంతో అధికారులను పలువురు నిలదీస్తున్నారు. రోడ్లపై నిర్మాణాలు జరుపుతున్నారని కంప్లయింట్​చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.