టొరంటో: నాకౌట్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో సెనెగల్ దుమ్మురేపింది. గ్రూప్–ఐలో జరిగిన మ్యాచ్‌లో 5–0తో ఇరాక్‌ను చిత్తు చేసి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 4వ నిమిషంలో హబీబ్ దియారా గోల్ కొట్టి శుభారంభం ఇచ్చాడు. 13వ నిమిషంలో ఇరాక్ డిఫెండర్ రెబిన్ సులాకాను సెనెగల్ స్టార్ సాడియో మానేను చొక్కా పట్టి లాగడంతో అంపైర్ రెడ్ కార్డు ఇచ్చాడు. అప్పట్నించి ఇరాక్ పది మందితోనే ఆడింది.
సెకండాఫ్‌లో మరింత దూకుడుగా ఆడిన సెనెగల్ ప్లేయర్లు వరుస విరామాల్లో గోల్స్‌తో హోరెత్తించారు. ఇస్మాయిలా సర్ (56వ ని), పాపే గుయే (59, 71వ ని), ఇలిమాన్ నిడియో (82వ ని) గోల్స్ సాధించారు. వచ్చిన రెండు పెనాల్టీలను పాపే గుయే అద్భుతంగా గోల్స్‌గా మలిచాడు.
