హైదరాబాద్, వెలుగు: టీజీ 20 లీగ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌లో వికాస్ రెడ్డి (93), అభిరథ్ రెడ్డి (59) రాణించడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 46 రన్స్ తేడాతో మెదక్ ఫాల్కన్స్‌పై గెలిచింది. టాస్ ఓడిన ఈ చాంపియన్స్ 20 ఓవర్లలో 240/8 స్కోరు చేసింది.
తర్వాత మెదక్ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 194/9 స్కోరుకే పరిమితమైంది. విక్రమ్ నాయక్ (75) టాప్ స్కోరర్. వరుణ్ (38), రవి తేజ (31), ఇషాన్ శర్మ (27) రాణించినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
