ట్రూకాలర్ నుంచి రికార్డింగ్ ఫీచర్ అప్ డేట్

ట్రూకాలర్ నుంచి  రికార్డింగ్ ఫీచర్ అప్ డేట్

గత సంవత్సరం గూగుల్, యాపిల్ నుంచి ప్రతికూల పరిణామాలు ఎదుర్కొన్న తర్వాత ట్రూకాలర్ దాని కాల్ రికార్డింగ్ ఫీచర్‌ లో మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మరోసారి మెరుగైన కార్యాచరణను అందించేందుకు కొత్త అప్ డేట్ తో వచ్చింది. టెక్ క్రంచ్ నివేదికల ప్రకారం.. ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ఇటీవల ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు యాప్ లోని డయలర్ నుంచి నేరుగా రికార్డింగ్ కాల్ ని ప్రారంభించవచ్చు. వారు వేరే డయలర్ ని ఉపయోగిస్తుంటే,  యాప్ ఫ్లోటింగ్ రికార్డింగ్ బటన్ ను చూపిస్తుంది. ఇంతలో ఐవోఎస్ యూజర్స్ ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్ లను మెర్జ్ చేయడానికి వినియోగదారులు ట్రూకాలర్ యాప్ ద్వారా రికార్డింగ్ లైన్ కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కాల్ రికార్డు అవుతుందని సూచించే 'బీప్' అనే సౌండ్ వినిపిస్తుంది.  ఈ ఫీచర్ ని మొదట 2018లో ప్రీమియం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం పరిచయం చేశారు. తర్వాత 2021లో ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, 2022లో,  గూగుల్ఏపీఐకి యాక్సెస్‌ని పరిమితం చేసింది. ఇది ట్రూకాలర్ ని ప్రభావితం చేయడంతో ఈ ఫీచర్ ని తీసేశారు.  కాల్ రికార్డింగ్ కోసం, కంపెనీ రాబోయే వారాల్లో ట్రాన్స్‌క్రిప్ట్‌లను పరిచయం చేయాలని చూస్తోంది.

యూఎస్ లో ప్లాన్లు ఇవే..

ట్రూకాలర్ అమెరికాలోని ట్రూకాలర్ ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచింది. అక్కడ మూడు ప్లాన్లు అమలు చేస్తోంది. నెలకు  ప్రైమరీ అడ్వర్టైజ్ మెంట్ లెస్ ప్లాన్ కి 1 డాలర్,  కాల్ రికార్డింగ్ తో కూడిన ప్రీమియం ప్లాన్ ను 3.99 డాలర్లకు, స్ర్కీనింగ్ అసిస్టెంట్ టాప్ టైర్ ప్లాన్ గా నెలకు 4.99 డాలర్లు చెల్లించాలని నిర్ణయించింది. యాప్ నకు 350 మిలియన్లకు పైగా యూజర్లు ఉండగా, ఇండియాలోనే 100 మిలియన్ల వినియోగదారులున్నారు.