
గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’. అంకిత ఖరత్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రావాలి.
కానీ తెలంగాణలో థియేటర్స్ బంద్ కారణంగా తమ చిత్రాన్ని మరో వారం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రం అలరించనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.