
తెలంగాణ హై కోర్టును బుద్వేల్ కు తరలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా హై కోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లాయర్స్ నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే హై కోర్టు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన హై కోర్టును తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.