
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ కంపెనీ లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ తన రూ. 254-కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరుకు రూ. 150-–158 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 29న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై 31న ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. జైపూర్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో 1.84 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 56.38 లక్షల షేర్ల ఆఫర్ఫర్సేల్(ఓఎఫ్ఎస్) ఉంటాయి.
తాజా ఇష్యూ నుంచి వచ్చే ఆదాయాన్ని లోన్ల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, భవిష్యత్తు మూలధన అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తారు. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, డిపాజిట్ -టేకింగ్, ఎంఎస్ఎంఈ, వెహికల్, కన్స్ట్రక్షన్సహా పలు రకాల లోన్లను ఇస్తుంది.