బాలాపూర్ ఎర్రకొంట వద్ద మైనర్ పై హత్యాయత్నం

బాలాపూర్ ఎర్రకొంట వద్ద మైనర్ పై హత్యాయత్నం
  • కత్తులతో అటాక్​ చేసిన ముగ్గురు మైనర్లు
  • బాధితుడి పరిస్థితి విషమం

ఎల్బీనగర్, వెలుగు: మొబైల్ అమ్మిన డబ్బుల విషయంలో గొడవ జరగ్గా.. ఓ మైనర్ పై మరో ముగ్గురు మైనర్లు కత్తులతో దాడి చేశారు. బాలాపూర్ ఎర్రకొంట వద్ద ఆదివారం రాత్రి నలుగురు స్నేహితులు మద్యం సేవించారు. ఇందులో ఒక మైనర్​ వద్ద మరో మైనర్​ మొబైల్ తీసుకొని అమ్మిపెడుతానని చెప్పాడు. మొబైల్ అమ్మేసి డబ్బులు ఇవ్వకుండా మొబైల్ ఇచ్చిన మైనర్ పైనే స్నేహితుల మధ్య దుష్ప్రచారం చేస్తున్నాడు. అది మనసులో పెట్టుకున్న మైనర్​.. మొబైల్​ అమ్మిన మైనర్​ను హత్య చేయాలని అనుకున్నాడు.

తన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం లిక్కర్​ తాగాడు. ఇద్దరిని వెంట పెట్టుకుని మొబైల్ అమ్మిన బాలుడి వద్దకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. బాధితుడిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.