ఎల్బీ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

ఎల్బీ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి స్టేడియంలో బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్న గ్రౌండ్స్ లో గత పదేళ్లుగా 250 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మికి సిబ్బంది తమ బాధను చెప్పుకున్నారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ బాధను అర్థం చేసుకొని జీతాలు చెల్లించాలని అభ్యర్థించారు.