మంచిర్యాల: పదేండ్లలో ఏనాడు చెన్నూరు ప్రజలను పట్టించుకోలేదని.. కేవలం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే పెద్దపీట వేశాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. శనివారం (జనవరి 24) చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ చౌక్ ప్రాంతంలో అర్బన్ డెవలఫ్మెంట్ ఫండ్&15th ఫైనాన్స్ 15 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వెజిటబుల్ మార్కెట్‌ను మంత్రి వివేక్ ప్రారంభించారు.
అనంతరం మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ అల్ఫోన్సా కాన్వెంట్ హై స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాల్క సుమన్ ఏనాడు చెన్నూరు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. క్యాతనపల్లి ROB పనులను బాల్క సుమన్ పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
తాను చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రోడ్ కనెక్టివిటీ పనులను పర్యవేక్షించి సంవత్సరం లోపే ROB పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చానని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.70 కోట్లతో ఇంటింటికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయానని అన్నారు. చెన్నూరు ప్రాంతానికి దోచుకొని దాచుకోవడానికి రాలేదని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
