ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ. 70 లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. పురుగుల మందు తాగి..

ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ. 70 లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. పురుగుల మందు తాగి..

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడొద్దని ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావట్లేదు. తరచూ ఎక్కడో ఒక చోట బెట్టింగ్ యాప్స్ కి బలవుతున్నవారి గురించి వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు జగిత్యాల జిల్లాలో మరో యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కి బలయ్యాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో రూ. 70 లక్షలు నష్టపోయిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ( జనవరి 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రానాపూర్ కు చెందిన జాదవ్ ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ లో రూ. 70 లక్షలు నష్టపోయాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ్ కుమార్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని.. ఈ ఉచ్చులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.