హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ మంత్.. వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం..

హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ మంత్.. వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం..

హైదరాబాద్ లో రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహిస్తోంది రవాణాశాఖ. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ( జనవరి 24 ) ఖైరతాబాద్ హెడ్ ఆఫీసు దగ్గర రోడ్ సేఫ్టీ, సేఫ్ డ్రైవింగ్ పై వినూత్న రీతిలో అవెర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు అధికారులు.రోడ్ సేఫ్టీ లో భాగంగా హెల్మెట్లు  ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించచాలని వాహనదారులకు యమధర్మరాజు వేషధారణతో అవగాహన కల్పించారు. 

నగర ప్రధాన రోడ్డు మార్గంలో వెళ్తున్న వాహనదారులు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని.. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు అధికారులు.

రోడ్ సేఫ్టీ పాటించక , రోడ్ ఆక్సిడెంట్స్ గురై చనిపోయే వారినీ యమధర్మ రాజు తీసుకెళుతాడని తెలియజేసేలా వినూత్నంగా అవగాహన కల్పించారు అధికారులు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, డిడిఓ, ఆర్టిఓలు హాజరయ్యారు.