లీడర్లు ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు

లీడర్లు ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నాయి. తిరుపతి ఆర్డీవో కార్యాలయ అధికారులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తదితర నాయకులు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇసుకను 760 కోట్ల టెండర్ విధానం ద్వారా ఇవ్వడం జరిగింది. బంగారం కంటే ఇసుక ధరే ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. సామాన్య ప్రజలు ఇసుకని బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇసుక విధానంలో సరైన అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించేందుకు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ టెండర్ విధానాన్ని ఏర్పాటుచేశారు. టెండరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఉచితంగా ఇసుకను ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అత్యధికంగా ఇసుక లభిస్తోంది. ప్రభుత్వ అండతో రాబందులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నందున నిరసన తెలియచేయకూడదంటూ పోలీసులు బీజేపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.